నగర వాసులకు శుభవార్త.. నిరీక్షణ రేపటితో తీరనుంది..?

September 24, 2020 at 6:24 pm

హైదరాబాద్ నగరవాసులు అందరికీ శుభ వార్త అందింది. నగర వాసులు అందరూ ఎప్పుడెప్పుడా అని నిరీక్షణ ఎదురుచూస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సులు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు రేపు రోడ్ ఎక్కనున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో పాక్షికంగా బస్సులు తిప్పుతుండగా రేపటి నుంచి పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

దీంతో హైదరాబాద్ నగర వాసులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి భారీ మొత్తంలో చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో… నగర వాసులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నగర వాసులకు శుభవార్త.. నిరీక్షణ రేపటితో తీరనుంది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts