మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన గంగ‌వ్వ‌.. ఇక ర‌చ్చ ర‌చ్చే!

September 20, 2020 at 8:29 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ సెప్టెంబ‌ర్ 6న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్ర‌వేశించ‌గా.. మొద‌టి వారం సూర్య కిర‌ణ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆయ‌న ప్లేస్‌లో వైల్డ్ కార్డు ద్వారా కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ముక్కు అవినాష్ కూడా హాస్‌లోకి వ‌చ్చారు. ఇదిలా ఉంటే.. గ‌త కొన్ని రోజులుగా మోస్ట్ స్పెష‌ల్ కంటెస్టెంట్ గంగ‌వ్వ ఉంటుందా.. లేదా.. అన్న‌ది హాట్ టాపిక్ అయింది.

ఎందుకంటే.. మొదటి వారం బాగా స్ట్రాంగ్‌గా ఉన్న గంగవ్వ.. రెండో వారం మాత్రం డీలా పడ్డారు. అంతేకాదు, కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లి.. నాకు ఆరోగ్యం బాగుండ‌టం లేదు.. ఇక్కడ ఉండలేకపోతున్నా.. నేను వెళ్లిపోతాను.. పంపేయండి అంటూ గంగ‌వ్వ‌ ఏడ్చేశారు. దీంతో ఈ వారం గంగ‌వ్వ బ‌య‌ట‌కు వెళ్లిపోతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే కన్ఫెషన్ రూంకి పిలిచి గంగవ్వతో మాట్లాడారు కింగ్‌ నాగార్జున. ఇప్పుడు అంతా బాగుందని.. సుది మంది వేశారని.. ఎంజాయ్‌గా ఉందంటూ జోష్‌గా చెప్పింది గంగవ్వ.

గంగవ్వా నువ్ నన్ను అన్నా అన్నావ్.. చెల్లెల్ని బాగా చూసుకునే బాధ్యత నాది అని భరోసా ఇచ్చి పంపించారు నాగ్. ఇక గంగవ్వ ఆరోగ్యంగానే ఉంది.. ఆమె బయటకు వచ్చే ఛాన్స్ లేదు.. మీరు ఓట్లు ద్వారా మాత్రమే ఆమెను బయటకు పంపగలరు అని క్లారిటీ ఇచ్చారు నాగార్జున. ఇక గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డ గంగవ్వ ఫామ్‌లోకి వచ్చి.. అంద‌రిపై సెటైర్లు వేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. దీంతో గంగ‌వ్వ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన గంగ‌వ్వ‌.. ఇక ర‌చ్చ ర‌చ్చే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts