బిగ్‌బాస్‌4: ఈ వారి ఎలిమినేష‌న్ నుంచి ఆ ఇద్ద‌రు సేఫ్‌!

September 27, 2020 at 8:34 am

బిగ్ బాస్ సీజ‌న్ 4 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. ఇప్ప‌టికే మొద‌టి వారం ద‌ర్శ‌కుడు సూర్య కిర‌ణ్ దుకాణం స‌ద్దేయ‌గా.. రెండో వారం క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అయింది. ఇక మూడో వారం ఎవ‌రు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోతారు అన్న‌ది ఉత్కంఠగా మారింది. ప్ర‌స్తుతం ఎలిమినేష‌న్‌కు యాంకర్ దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు నామినేష‌న్స్‌లో ఉన్నారు.

ఈ ఏడుగురిలో ఒకరు నేడు బ్యాగ్ సర్దేయనున్నారు. అయితే శ‌నివారం జ‌రిగిన ఎపిసోడ్‌లో నాగార్జున నామినేష‌న్స్‌లో ఉన్న ఏడుగురిలో ఇద్ద‌రిని సేఫ్ చేశారు. వారెవ‌రో కాదు.. లాస్య, మోనాల్‌. కంటెస్టెంట్‌లతో మాస్క్ గేమ్ ఆడించిన నాగార్జున.. ఒక్కో హౌజ్‌మేట్ ఒక్కో మాస్క్ తీసుకొని నాగార్జున చెప్పే వ్యక్తి ముందు బ్యాడ్ క్వాలిటీలు చెప్పాలని అన్నారు.

ఆ ఆట తరువాత ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో లాస్య, మోనాల్‌ని సేవ్ చేశారు నాగార్జున. ఇక తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా దిల్ సే మెహబూబ్, దేవి ఇద్దరిలో ఎవరు ఒకు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగు‌తోంది. మ‌రి అది తెలియాలంటే మ‌రి కొన్న గంట‌లు వెయిట్ చేయాల్సిందే.

బిగ్‌బాస్‌4: ఈ వారి ఎలిమినేష‌న్ నుంచి ఆ ఇద్ద‌రు సేఫ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts