ఎమ్మెల్యేపై సెటైర్ వేసిన జగన్‌ని ట్రోల్ చేసిన చినబాబు…

September 24, 2020 at 11:38 am

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే జగన్ తిరుమలకు వచ్చే ముందు రేణిగుంట విమానాశ్రయంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం జగన్‌కు ఆహ్వానం పలికేందుకు వచ్చిన శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన కుమార్తె పవిత్ర.. జగన్‌తో ఫొటో దిగేందుకు ప్రయత్నించారు. అయితే తండ్రీకూతుళ్లు ఇద్దరూ మాస్క్ ధరించి ఫొటోకు ఫోజిచ్చారు. దీంతో సీఎం జగన్ మాస్కులు వేసుకుని ఫోటోకు దిగడం ఏంటని సెటైర్ వేయడంతో, ఇద్దరు మాస్కులు తీసి ఫోటో దిగారు.

ఇక దీనిపై టీడీపీ నేత నారా లోకేష్, జగన్‌పై ఫైర్ అయ్యారు. ఆ వీడియో పెట్టి మరీ, జగన్‌ని ట్విట్టర్‌లో ట్రోల్ చేశారు. ‘లక్షల్లో కరోనా కేసులు,వేల సంఖ్యలో ప్రజల చనిపోతున్నారు. అయినా వైఎస్ జగన్ గారు మాత్రం మూర్ఖత్వానికి మానవ రూపంగానే మిగిలిపోయారు.ఆయన మాస్క్ పెట్టుకోరు,వేరే వాళ్ళు పెట్టుకుంటే ఊరుకోరు. మరి దళిత యువకుడు కిరణ్‌ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టిచంపడం ఎందుకు?..పోలీస్ స్టేషన్ లో కిరణ్‌ని చంపింది మాస్క్ వేసుకోలేదనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?’అంటూ ట్వీట్ చేశారు.

ఎమ్మెల్యేపై సెటైర్ వేసిన జగన్‌ని ట్రోల్ చేసిన చినబాబు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts