నారా రోహిత్ కొత్త లుక్ అదిరింది.. అస‌లు సీక్రెట్ ఏంటంటే?

September 15, 2020 at 7:37 am

నారా రోహిత్‌.. బాణం చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొద‌టి సినిమాతోనే ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. అందరి హీరోల్ల కమర్షియల్ స్టోరీల వెంట పడకుండా.. కంటెంట్ ఉన్న కథలవైపే దృష్టి సారించి మంచి విజ‌యాన్ని అందుకుంటున్నాడీయ‌న‌. ఇక నారా రోహిత్ కేవ‌లం హీరోగానే కాకుండా.. నిర్మాతగా ఆరన్ మీడియా సంస్థపై పలు చిత్రాలను కూడా నిర్మించాడు.

ఇదిలా ఉంటే.. నారా రోహిత్ తన ట్విట్టర్ అకౌంటుకి ఓ కొత్త లుక్కును ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. పొడవాటి గెడ్డం .. మీసాలతో తీక్షణంగా చూస్తున్న రోహిత్ లుక్ ఇట్టే ఆకట్టుకుంటోంది. ఈ కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ కొత్త లుక్ తన కొత్త సినిమా కోసమని తెలుస్తోంది.

బాణం చిత్రం దర్శకుడు చెైతన్య దంతులూరి దర్శకత్వంలో 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ చిత్రంలో నారా రోహిత్ న‌టించ‌బోతున్నాడ‌ని.. అందుకే కొత్త లుక్ ని ఎంచుకున్నట్టు చెబుతున్నారు. కాగా, నారా రోహిత్ కు కెరీర్ పరంగా చాలా గ్యాప్ వచ్చింది. రెండేళ్ల క్రితం వచ్చిన ‘వీర భోగ వసంతరాయలు’ చిత్రం తర్వాత మరో సినిమా రాలేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని.. అందుకు అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

నారా రోహిత్ కొత్త లుక్ అదిరింది.. అస‌లు సీక్రెట్ ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts