ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీకి ఊహించ‌ని షాక్‌!

September 18, 2020 at 9:12 am

నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70 పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి ఆయ‌న శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలు దేశాల అధినేతలు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మ‌రోవైపు పలు సేవా కార్యక్రమాలతో తమ అభిమాన నేత బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు.

సోష‌ల్‌ మీడియా వేదికగా ట్వీట్లు, పోస్ట్‌ల మోత మోగిస్తున్నారు. అయితే మ‌రోవైపు ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. కరోనా లాక్‌డౌన్ వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను ట్విటర్‌లో నెటిజన్లు నిరసనలు వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ మేరకు ‘నేషనల్‌ అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ డే(జాతీయ నిరుద్యోగ దినోత్సవం)’ హ్యాష్‌ ట్యాగ్‌తో గురువారం నిరసనను ప్రారంభించగా, దీనికి 16 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి. ఇక నిన్న ప్ర‌ధాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా `హ్యాపీ బర్త్‌డే పీఏం మోదీ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ కంటే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లే అత్య‌ధికంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీకి ఊహించ‌ని షాక్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts