ప్ర‌భాస్ `ఆదిపురుష్` క‌థ‌లో న్యూ ట్విస్ట్‌?

September 25, 2020 at 7:42 am

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత రెండు భారీ ప్రోజెక్ట్‌ల‌ను కూడా ప్ర‌భాస్ లైన్‌లో పెట్టారు. అందులో ఒకటి `ఆదిపురుష్‌`. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఔం రౌత్ తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ చిత్రం రామాయణం కథాంశంలో తెరకెక్కుతోంద‌టూ ఇప్ప‌టికే ప్ర‌చారం ఊపందుకుంది.

ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించనున్నాడు. ప్రభాస్ కు ప్రతినాయకుడిగా అంటే లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఈ సమయంలో రాముడిపై సినిమా అంటే అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌భాస్ `ఆదిపురుష్` క‌థ గురించి ఓ కొత్త టాక్ న‌డుస్తోంది. అస‌లు ఆదిపురుష్ స్టోరీకి రామాయణంకు సంబంధం లేదు అన్నట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రే అయిన‌ప్ప‌టికీ.. ధనస్సు పట్టుకుని నీలవర్ణంలో కనిపించబోడ‌ట‌. అలాగే సైఫ్ అలీ ఖాన్ లంకేష్ అయినా కూడా రావణుడి మాదిరిగా పది తలలు ఉండవ‌ని తెలుస్తోంది. కేవ‌లం రామాయణంలోని పాత్రల స్వభావంను తీసుకుని వాటితో మరో కథను చూపించేదే ఆదిపురుష్ అంటున్నారు. ఏదేమైనా ఈ చిత్రం ఎవ‌రి ఊహల‌కు అందని విధంగా ఉంటుందని ఆర్థం అవుతోంది. కాగా, దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో 3డీ ఫార్మాట్ లో ఈ సినిమాను టీసిరీస్ నిర్మించనుంది.

ప్ర‌భాస్ `ఆదిపురుష్` క‌థ‌లో న్యూ ట్విస్ట్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts