కరోనాను లెక్క‌ చేయని ప్ర‌జ‌లు.. అప్పుడే ఫుల్ అయిన సంక్రాంతి రైళ్లు!

September 20, 2020 at 8:55 am

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. భారత్ సహా అనేక దేశాల్లో పాజిటివ్ కేసులు.. దానికి అనుగుణంగా మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తూనే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే రికార్డయ్యాయి.

అయితే క‌రోనా వేగంగా విజృంభిస్తున్న‌ప్ప‌టికీ.. ప్రజల్లో ఉన్న భయాందోళనలు మాత్రం క్రమంగా తగ్గుతున్నాయి. అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యాక‌.. ప్ర‌జలు మ‌ళ్లీ సాధార‌ణ జీవితానికి అల‌వాటు పడుతున్నారు. ఈ క్ర‌మంలోనే పండుగ ప్రయాణాలకు కూడా వెనకాడడం లేదు. అవును, సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారితో రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోవడాన్ని చూస్తుంటే కరోనాను ప్రజలు ఏమాత్రం లెక్కచేయడం లేదని స్ప‌ష్టం అర్థం అవుతోంది.

తాజాగా విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైళ్ల రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభించ‌డంతో.. కేవ‌లం నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోయాయి. మ‌రోవైపు వెయిటింగ్ లిస్టులు కూడా భారీగానే పెరగడం గమనార్హం. ముఖ్యంగా, విశాఖపట్టణం, విజయనగరం మార్గాల్లో నడిచే రైళ్లలో వెయిటింగ్ లిస్టులు భారీగా పెరిగిపోయాయి. ప్రయాణ తేదీకి నాలుగు నెలల ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో.. రిజర్వేషన్ కేంద్రాలు ప్రయాణికులతో నిండిపోతున్నాయి.

కరోనాను లెక్క‌ చేయని ప్ర‌జ‌లు.. అప్పుడే ఫుల్ అయిన సంక్రాంతి రైళ్లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts