ఎస్పీ బాలు అంత్యక్రియలకు వారికి నో ఎంట్రీ?

September 26, 2020 at 9:42 am

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి ఎవ‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. తన గాన మాధుర్యంతో యావత్ ప్రపంచాన్ని ఆనంద సాగరంలో ఓలలాడించిన ఆయ‌న‌.. గ‌త 44 రోజులుగా చెన్నై ఎంజియం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటి.. ఇక సెల‌వంటూ నిన్న మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మరణించారు. ఈయన మృతి ఇండస్ట్రీని శోక సంద్రంలో నింపేసింది.

ఆయన మరణం తెలుగు భాషకు, జాతికి తీరని లోటగా మిగిలిపోయింది. ఈరోజు ఉదయం 11 గంటలకుప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని ఫామ్ హౌజ్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్ దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఫామ్ హౌస్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశామని, అభిమానులకు ప్రవేశం లేదని, దయచేసి అర్థం చేసుకోవాలని ఆయన వివ‌రించారు. బారికేడ్లను దాటి ఏ వాహనాన్ని కూడా అనుమతించబోమని, ప్రొటోకాల్ అధికారులకు మాత్రమే ఫామ్ హౌస్ వరకూ అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఎస్పీ బాలు అంత్యక్రియలకు వారికి నో ఎంట్రీ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts