ప్లాస్మాదానంతో తగ్గని కరోనా.. తేల్చేసిన ఐసీఎంఆర్?

September 16, 2020 at 10:19 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ఎప్పుడు ఈ క‌రోనా భూతం అంతం అవుతుందా అని ప్ర‌పంచ‌దేశాలు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వ్యాక్సిన్ రాక‌పోవ‌డంతో.. ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇదిలా ఉంటే..గత కొన్ని రోజులుగా ప్లాస్మా థెరపీ అనే మాట తరచూ వార్తల్లో వినిపిస్తోంది.

కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న రోగి నుంచి యాంటీ బాడీలను సేకరించి విషమ స్థితిలో ఉన్న క‌రోనా రోగులకు ఇవ్వడం వారు త్వరగా కోలుకోగలుగుతారన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ప్లాస్మా దానానికి పలువురు ముందుకొచ్చారు. అయితే, తాజాగా భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్).. 14 రాష్ట్రాల్లోని 39 ఆసుపత్రుల్లో 469 మంది బాధితులపై చేసిన అధ్యయనంలో షాకింగ్ విష‌యాలు బ‌య‌ప‌ట్ట‌డాయి.

క‌రోనా మరణాలను, తీవ్ర‌త‌ను ప్లాస్మా థెరపీ ఏమాత్రం తగ్గించలేకపోయిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ మేర‌కు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ స్ప‌ష్టం చేశారు. అయితే ఈ అధ్యయన వివరాలు ఇంకా ప్రచురితం కాలేదు. దీనిపై శాస్త్రవేత్తల సమీక్ష కొనసాగుతోంది. సమీక్ష పూర్తయిన అనంతరం అధ్యయనం ప్రచురితం కానుంది. ఇక త్వ‌ర‌లోనే ప్లాస్మా థెర‌పీ కొన‌సాగించాలా.. వ‌ద్దా..? అనేదానిపై నిర్ణ‌యం కూడా తీసుకోనున్నారు.

ప్లాస్మాదానంతో తగ్గని కరోనా.. తేల్చేసిన ఐసీఎంఆర్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts