ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు: ఉత్తర కొరియా నియంత కిమ్

September 25, 2020 at 5:42 pm

ఐదు సంవత్సరాల పిల్లలకు నీతి కథలు చెప్పకుండా కిమ్ కథలను భోదిస్తున్నారు. కిమ్ గొప్పతనం తెలుసుకోవడానికి పిల్లలకు 90 నిమిషాల ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేశారు. అలాంటిది ఉత్తర కొరియా నియంత కిమ్ తన జీవితంలో మొదటిసారి క్షమాపణలు చెప్పారంటే ఆ దేశ ప్రజలు నివ్వేరపోతున్నారు. తనెప్పుడు బద్ధశత్రువుగా భావించే దక్షిణ కొరియా ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఎందుకు క్షమాపణలు చెప్పారో కారణం మాత్రం చెప్పలేదు… కానీ సియోల్ అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించారు.

కొన్ని రోజులు క్రితం మొదటిసారిగా ఉత్తర కొరియా సైన్యాన్ని కాల్చి చంపింది. దక్షిణ కొరియా అధికారులు ఉత్తర కొరియా జలాల్లోకి ప్రవేశించడంతో కరోనా భయంతో పినట్లు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కొరియా అధికారిని కాల్చి చంపడంపై సీరియస్ అయిన సియోల్ అధికారులు, వివరణ కోరారు. దీంతో ఈ తతంగం ఇక్కడితో తెరపడినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా చరిత్రలో ఉత్తర కొరియా నియంత కిమ్ తన జీవితంలో మొదటిసారి క్షమాపణలు చెప్పారు.

ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు: ఉత్తర కొరియా నియంత కిమ్
0 votes, 0.00 avg. rating (0% score)