జగన్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్..!

September 23, 2020 at 11:14 am

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హఠాత్తుగా మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం హోమ్ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.

అయితే బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి  గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని సీఎం జగన్‌ కోరగా, త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆ వెంటనే జగన్ మరోసారి అమిత్ షాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఇక ఇందులో జగన్-అమిత్ షాల మధ్య ఏం చర్చకు వచ్చిందనేది తెలియాల్సి ఉంది.

కాగా, నిన్న జరిగిన భేటీలో కోర్టులు, న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులపై, అనేక అంశాలపై చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 

 

జగన్ ఢిల్లీ పర్యటనలో ట్విస్ట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts