మరోసారి అస్వస్థతకు గురైన ఎస్పీ బాలు..!

September 24, 2020 at 7:39 pm

దిగ్గజ గాయకుడు, గానగంధర్వుడు, ప్రముఖ గాయకుడు  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు గురైయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.

 

ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కాసేపట్లో బాలు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్‌ బులెటిన్‌  విడుదల చేయనునట్లు తెలిపారు. ఇక ఆగస్టు 5న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. ఆయన కరోనాను జయించిన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు అందరు కోరుకుంటున్నారు.

మరోసారి అస్వస్థతకు గురైన ఎస్పీ బాలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts