జగన్ ఢిల్లీ టూర్: అమరావతిలో ఆగిన మరో గుండె…  

September 22, 2020 at 9:46 am

అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత రైతులు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజధాని తరలివెళ్లిపోతుందనే భయంతో పలువురు రైతులు గుండెపోటుతో చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే నేడు మరో రైతు గుండెపోటుతో చనిపోయారు. ప్రభుత్వం మూడు రాజధానులు నిర్ణయంతో అమరావతి తరలి పోతుందని ఆందోళన చెందిన తుళ్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన రైతు పారా సదాశివరావు(59) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.  రాజధాని నిర్మాణానికి ఆయన రెండు ఎకరాల 25 సెంట్ల భూమిని ఇచ్చారు.

ఇదిలా ఉంటే నేడే జగన్, ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండటం, మూడు రాజధానులపై మోడీతో చర్చిస్తారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అమరావతి లాండ్ స్కాం మీద సి‌బి‌ఐ విచారణ చేయించాలని వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఫైబర్ గ్రిడ్ అంశాన్ని కూడా వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ కూడా ప్రధానిని కలిసి రాజధాని భూముల అక్రమాలపై సీబీఐ విచారణ కోరే అవకాశముందని తెలుస్తోంది.

 

జగన్ ఢిల్లీ టూర్: అమరావతిలో ఆగిన మరో గుండె…  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts