రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ ..

September 28, 2020 at 11:44 am

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, విజయ్‌ కుమార్‌ కొండా కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. ఈ చిత్రంలో మాళవికా నాయర్, హెబ్బా ప‌టేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

ఈ ట్రైలర్ ను అక్కినేని నాగ చైతన్య చేతులమీదుగా రిలీజ్ చేశారు. నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ అనే డైలాగుతో విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్ టైనర్ లా కట్ చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయించింది. రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌ కెమిస్ట్రీ మ‌రింత ఆకట్టుకుంటుంది.

కాగా, కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆ’లో అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌ ప్రత్యేక పాత్రలో అలరించనున్నారు. అలాగే విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రాజా రవీంద్ర, అన్నపూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మ‌రి ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ట్రైలర్ ..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts