స‌రికొత్త పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌..!

September 29, 2020 at 1:40 pm

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పాత్ర‌ల‌ను ఎంచుకోవ‌డంలో విభిన్న‌త‌ను చూపుతున్నారు. ఒక సినిమాకు మ‌రో సినిమాకు పొంత‌న లేని విధంగా వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లు తెలుస్తున్న‌ది. సినీ ప్ర‌యాణం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప‌వ‌న్ ఎక్కువ‌గా ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌ల‌కే మొగ్గుచూపారు. అందుకు భిన్నంగా కొంత‌కాలంగా విభిన్న పాత్ర‌ల‌ను క‌నిపించేందుకు మ‌క్కువ చూపుతున్నారు. జ‌ల్సాలో మావోయిస్ట్‌గా, గ‌బ్బ‌ర్‌సింగ్‌లో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించి అభిమానుల‌ను మెప్పించారు. తాజాగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న వకీల్ సాబ్ మూవీలో లాయర్‌గా, క్రిష్ మూవీలో బందీపోటుగా కనిపించనుండ‌డం విశేసం.

ఇదిలా ఉండ‌గా.. ఇక హరీష్ శంకర్ తెరకెక్కించే చిత్రంలో లెక్చరర్ పాత్రలో పీకే కనువిందు చేయ‌నున్న‌ట్లు ఇప్పుడు టాలివుడ్ వ‌ర్గాల్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న విషయం అంద‌రికీ తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ఇటీవ‌లే విడుదల చేసిన విష‌యం తెలిసిందే. అందులో బైక్‌, ఇండియా గేట్‌, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోలను ఉంచారు. ఓ కాలేజీలో లెక్చరర్ సామాజిక సమస్యలపై ఎలా పోరాడారు? అన్న క‌థ‌తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తున్న‌ది. సినిమాను మ‌లుపుతిప్పే ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉండ‌నుందని, అందులో పవన్ పోలీస్‌గా కనిపించనున్నాడని సినీవ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అయ‌మరి ఇందులో నిజమెంత..? పవన్‌ని హరీశ్‌‌ ఎలా చూపించనున్నారు? ఈ ప్రాజెక్ట్‌లో మిగిలిన న‌టులెవ్వ‌రు? వ‌ంటి అంశాలు మ‌రిన్ని తెలియాలంటే మ‌రికొంత కాలం వేచిచూడాల్సిందే.

స‌రికొత్త పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts