ప‌వ‌న్‌.. క్రిష్ సినిమా టైటిల్ మార్పు..?

September 15, 2020 at 7:22 am

క‌రోనా నేప‌థ్యంలో నిలిచిపోయిన చిత్ర ప‌రిశ్ర‌మ కార్య‌క‌లాపాలు మ‌ళ్లీ గాడిన ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాల షూటింగ్‌లు ప్రారంభం కాగా, మ‌రికొంద‌రు హీరోలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంకొంద‌రు తార‌లు షూటింగ్ మిన‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంటున్నారు. తాజాగా పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఆ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. ప‌వ‌న్ ఇమేజ్ త‌గిన పేరును ఫిక్స్ చేసిన‌ట్లు సినీ వ‌ర్గాల స‌మాచారం.

పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏ.ఎమ్‌.రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పీడిత ప్రజలకు అండగా నిలబడే యోధుడిగా రాబిన్‌హుడ్‌ తరహాలో కనిపించబోతున్నట్లు సమాచారం. జాక్వెలిన్‌ ఫేర్నాండేజ్‌ ఓ నాయికగా న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుండ‌గా, ప్రధాన హీరోయిన్ పాత్ర‌ కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అన్వేషణ సాగిస్తోన్నారు. చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఈ చిత్రానికి ‘శివమ్‌’ అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తొలుత ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా టాలివుడ్‌లో ప్రచారం జరిగింది. కానీ ఆ పేరు ప‌వ‌న్ ఇమేజ్‌కు సరితూగదనే ఆలోచనతో చిత్రబృందం ఆ టైటిల్‌ను మార్చాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది. సినిమాకు ‘శివమ్‌’ పేరు మార్చాలనుకుంటున్న‌ట్లు సినీవ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతున్న‌ది. వచ్చే నెలలో చిత్రీకరణను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుండ‌డం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్న‌ది.

ప‌వ‌న్‌.. క్రిష్ సినిమా టైటిల్ మార్పు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts