బాలుగారిని చిన్నప్పటి నుంచి చూశాను: పవన్ కళ్యాణ్

September 25, 2020 at 4:42 pm

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలు చనిపోయారంటూ మధ్యాహ్నం తన ఆఫీసు సిబ్బంది తనకు చెప్పారని తెలిపారు. కరోనా బారిన పడ్డానని, కోలుకుంటున్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలు చెప్పారని… ఆయన త్వరగా కోలుకోవాలని తాను కూడా ఆకాంక్షించానని చెప్పారు. ఆయన కోలుకోవాలని యావత్ దేశం కోరుకుందని… కానీ, దురదృష్టవశాత్తు ఆయన మనకు దూరమైపోయారని అన్నారు.

బాలుగారిని చిన్నప్పటి నుంచి చూశానని… ఆయనంటే తనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందని చెప్పారు. ఇలాంటి స్థితిలో ఆయన మృతి చెందడం కలచివేస్తోందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో ద్వారా తన స్పందనను తెలియజేశారు.

బాలుగారిని చిన్నప్పటి నుంచి చూశాను: పవన్ కళ్యాణ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts