తమ్ముడు ట్వీట్ తో.. చిరు సినిమా పై క్లారిటీ..!

September 3, 2020 at 4:37 pm

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకులతో వరుసపెట్టి సినిమాలు చేయబోతున్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. దాంతో వాటిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’తో బిజీగా ఉండగా.. ఆ తర్వాత సుజీత్‌, బాబీలతో కలిసి పనిచేయనున్నారు మెగాస్టార్. మెహర్‌ రమేశ్ డైరక్షన్​లో‌నూ నటించనున్నట్లు చిరంజీవి ఓ సందర్భంలో చెప్పినా.. దానిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ పవన్​ కల్యాణ్ ట్వీట్​తో అది దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.​

పవన్​ కల్యాణ్​ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మెహర్​ రమేశ్​ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిగా​ ట్వీట్​ చేసిన పవన్.. “చిరంజీవితో తీయబోయే కొత్త చిత్రానికి ఆల్​ ది బెస్ట్​” అని సమాధానమిచ్చారు.తమిళ సూపర్​హిట్​ ‘వేదాళం’ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెహర్​ తయారు చేశారట. పూర్తి వివరాలు కోసం మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.

తమ్ముడు ట్వీట్ తో.. చిరు సినిమా పై క్లారిటీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts