సముద్రం నుంచి బయటకు వచ్చిన వింత జీవిని చూసి భయంతో జనం.. !!

September 24, 2020 at 7:59 pm

ఈ ప్రపంచంలో రోజుకు ఒక వింత జరుగుతూనే ఉంటుంది.ఆ వింతను చూడడానికి ప్రజలు సైతం ఆసక్తి చూపుతారు. అలాంటి ఒక వింత జీవి ఇప్పుడు సముద్రం నుంచి బయటకి వచ్చి ప్రజల్ని భయపెడుతుంది.. సాధారణంగా మనం సముద్రంలో దొరికే అన్ని జీవాల్ని ఎదో ఒక వీడియోలో గాని టీవీ లో గాని చూసి ఆశ్చర్యపోతాము. అలాంటి ఒక వింత జీవి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. ఆ జీవిని నేచర్ ఈజ్ స్కేరీ అనే పేరు గల ట్విట్టర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయబడింది.దీనికి శీర్షిక కూడా ఉందండోయ్.. !!

సముద్రపు అడుగుభాగంలో కనిపించే వింత జీవి అని అర్ధం అంట. ఈ జీవి బాలిలోని సముద్రం వద్ద దొరికింది. ఈ జీవి పేరు” జెలటినెస్ “. ఈ జీవి ఒక 15 సెకండ్ల పాటు నడుస్తూ ఉంటుంది. చూడడానికి అస్థిపంజరంలా ఉంటుంది. శరీరంలో లోబ్ లు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఈ జీవి నోరు ముందుకు తెరిచి భయపడుతుంది కూడా.మళ్ళీ యధాస్థితికి వచ్చేస్తుంది. అసలు ఈ వీడియో ఎప్పటిదికాదు.. ఎప్పుడో 2016 లో కనిపించిన జీవి ఇది. కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వైరల్ అయింది..

 

సముద్రం నుంచి బయటకు వచ్చిన వింత జీవిని చూసి భయంతో జనం.. !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts