ఆ ఏడు రాష్ట్రాల సీఎంల‌తో మోదీ భేటీ.. దానిపైనే ఫోక‌స్‌?

September 23, 2020 at 10:23 am

ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం అయ్యాక.. క‌రోనా అడ్డు అదుపు లేకుండా విజృంభిస్తోంది. ఇప్ప‌టికే దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 56 ల‌క్ష‌లు దాటేసింది. అలాగే క‌రోనా వైర‌స్ కాటుకు బ‌లైపోయిన వారి సంఖ్య 90 వేల‌కు చేరుకుంది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు, ఆరోగ్యశాఖ మంత్రులతో మోడీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం కరోనా కేసుల్లో 65.5శాతం, మరణాల్లో 75 శాతం వరకు ఆయా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

అందుకే మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు అంశాలపై ఈ భేటీలో చేర్చించ‌నున్నారు. అలాగే మహారాష్ట్ర, పంజాబ్‌, ఢిల్లీలో కరోనా మరణాలు దేశ సగటు 1.6 శాతం కంటే ఎక్కువగా.. రెండు శాతం ఉండడంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఆ ఏడు రాష్ట్రాల సీఎంల‌తో మోదీ భేటీ.. దానిపైనే ఫోక‌స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts