శ్రావణి సూసైడ్ కేసు: అరెస్ట్ అయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత!

September 16, 2020 at 12:53 pm

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసులో పోలీసుల విచారణ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిన‌ట్టే తెలుస్తోంది. శ్రావణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఎవ‌రి వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకుంది? అనే అంశాల‌పై పోలీసులు ఓ క్లారిటీకి వ‌చ్చారు. ఇదిలా ఉంటే.. శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డిను పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయికృష్ణారెడ్డిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయ‌గా.. ఏ3 నిందితుడిగా ఉన్న అశోక్ రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఎస్సార్ నగర్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు వస్తానని చెప్పి.. సెల్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

ఈ క్ర‌మంలోనే ఆయన సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, సినిమా రంగంలో అవకాశాల పేరుతో శ్రావణితో అశోక్‌రెడ్డి దగ్గరయినట్టు పోలీసులు గుర్తించారు. శ్రావణికి దేవరాజ్ దగ్గర కావడంతో తట్టుకోలేకపోయిన అశోక్‌రెడ్డి సాయికృష్ణ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి వారు విడిపోయేలా చేశాడ‌ని తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు అశోక్ రెడ్డిని పోలీసుల‌కు అదుపులోకి తీసుకోవ‌డంతో.. మ‌రిన్ని విష‌యాలు బ‌య‌ట‌ప‌డ‌నున్నాయి.

శ్రావణి సూసైడ్ కేసు: అరెస్ట్ అయిన ఆర్ఎక్స్ 100 నిర్మాత!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts