అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్‌.. ఏం జ‌రిగిందంటే?

September 17, 2020 at 8:11 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు షాక్ త‌గిలింది. ఈయ‌న‌పై తాజాగా సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్ల‌ఘించారంటూ ఆయ‌న‌పై కేసు న‌మోదైంది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమా అంతా స్మగ్లింగ్ నేపథ్యంలోనే సాగుతుంది.

ఈ సినిమాను సుకుమార్ ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ఇక క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే త్వరలో ఈ చిత్రం షూటింగ్ మళ్లి ప్రారంభంకానుంది. ఈ క్రమంలో లోకేషన్స్ కోసం చిత్ర‌టీమ్ సెర్చ్ చేస్తోంది. అందులో భాగంగా ఇటీవ‌ల పుష్ప టీమ్ ఆదిలాబాద్ ఫారెస్ట్‌కు వెళ్లిన‌ సంగతి తెలిసిందే.

అక్కడ పుష్ప టీమ్ కుంటాల జలపాతాన్ని, తిప్పేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించారు. అయితే కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

అల్లు అర్జున్‌పై పోలీస్ కంప్లైంట్‌.. ఏం జ‌రిగిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts