ప్రభాస్ కి కేవలం 60 రోజులు మాత్రమే ‌?

September 16, 2020 at 10:56 am

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో త‌ర్వాత ప్రభాస్ తన 21వ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవ‌ల త‌న 22వ చిత్రాన్ని కూడా ప్ర‌భాస్ ప్ర‌క‌టించారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్` అనే భారీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నారు.

పౌరాణిక నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనుండగా రావణునిగా సైఫ్ ను ఫిక్స్ చేసారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై ఇప్ప‌టికే భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

బాహుబలి రెండు భాగాలు, సాహో తో పోలిస్తే… అతి తక్కువ స‌మ‌యంలోనేలో ‘ఆదిపురుష్‌’ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం‌ కేవలం 60 రోజులు మాత్రమే ప్ర‌భాస్ కేటాయించారట. అంటే రెండు నెల‌ల స‌మ‌యంలో ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేయ‌నున్నాడ‌ట ప్ర‌భాస్‌. కాగా, వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం.. 2022లో విడుదల కానుంద‌ని స‌మాచారం.

ప్రభాస్ కి కేవలం 60 రోజులు మాత్రమే ‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts