ప్ర‌భాస్ చాలెంజ్‌ను స్వీక‌రించిన శ్ర‌ద్ధాక‌పూర్‌

September 16, 2020 at 6:01 pm

రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ విసిరిన ఓ చాలెంజ్‌ను బాలివుడ్ హీరియిన్ శ్ర‌ద్ధాక‌పూర్ స్వీక‌రించారు. ఆ టాస్క్‌ను పూర్తి చేసి డార్లింగ్‌పై త‌న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత‌కీ ఆ చాలెంజ్ ఏమిటీ? అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్న‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అడ‌వుల సంర‌క్ష‌ణ కోసం ప్ర‌తిష్టాత్మ‌కంగా హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే క‌దా. అందులో భాగంగా తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టారు. గ‌త మూడేళ్లుగా ఏటా వ‌ర్షాకాలంలో ఉద్య‌మంలా నిర్వ‌హిస్తున్నారు.

అందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు మొక్కలు నాటారు. డార్లింగ్ ప్ర‌భాస్ ఏకంగా ఓ అడ‌విర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌నే ద‌త్త‌త తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా బాహుబలి ప్రభాస్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ బొంబాయి లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ విషయాన్ని తన సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. సంబంధిత ఫొటోను సైతం ఆమె షేర్ చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాది.

ప్ర‌భాస్ చాలెంజ్‌ను స్వీక‌రించిన శ్ర‌ద్ధాక‌పూర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts