ప్రజలు సిద్ధం కండి.. మొదలైన కరోనా సెకండ్ వేవ్..?

September 24, 2020 at 7:07 pm

మొన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అత్యధిక కరోనా కేసులు ఉన్న రాష్ట్రంగా ఉండేది ఢిల్లీ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి నియంత్రణ చర్యలు చేపట్టడంతో కాస్త కరోనా వైరస్ కంట్రోల్ అయింది. దీంతో అక్కడి ప్రజలందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్ళీ ఈ నెల నుంచి కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.దీంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

ఇటీవల ఈనెల 16వ తేదీన అత్యధికంగా 4500 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలందరూ సిద్ధం కావాలి అంటు పిలుపునిచ్చారు. తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ప్రజలు సిద్ధం కండి.. మొదలైన కరోనా సెకండ్ వేవ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts