ప్రకటనల్లో నటించను.. కారణం అదే ‘వి’ హీరోయిన్..?

September 20, 2020 at 3:01 pm

తెలుగు చిత్ర పరిశ్రమలో అతిథి రావు హైదరి కొన్ని సినిమాలతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అందాల ఆరబోతకు దూరంగా ఉండే ఈ అమ్మడు… చిలిపి నవ్వుతోనే ప్రేక్షకుల మతి పోగొడుతుంది. అయితే అడపాదడపా సినిమాలు చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే నాని సుధీర్ బాబు హీరోలుగా మల్టీస్టార్ గా తెరకెక్కిన ‘వి’ సినిమాలో నాని కి జోడిగా నటించిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూ కి హాజరైన అతిధి రావు హైదరి… తాను సౌందర్య వాణిజ్య ప్రకటనల్లో ఎందుకు నటించను అనే విషయాన్ని చెప్పుకొచ్చారు. తనకు గతంలో ఓ సౌందర్య ఉత్పత్తి కి సంబంధించిన ప్రకటన ప్రమోట్ చేయాలంటూ ఆఫర్ వచ్చిందని… కానీ ఆ ఆఫర్ను తిరస్కరించాను అంటూ తెలిపింది. ఇక ఆ తర్వాత ఎన్ని సార్లు ఆఫర్ వచ్చినా తాను మాత్రం సౌందర్య ప్రకటనల్లో నటించేందుకు ఒప్పుకోలేదు అంటూ తెలిపింది. సమాజం మనిషి యొక్క అందాన్నే కాదు మనిషి ప్రతిభను చూసి గుర్తించాలి అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

ప్రకటనల్లో నటించను.. కారణం అదే ‘వి’ హీరోయిన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts