ఐపీఎల్ టైమింగ్ మార్చమన్న అభిమానికి వంట‌ల‌క్క సర్పైజ్ గిఫ్ట్‌‌!

September 19, 2020 at 2:46 pm

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే `కార్తీకదీపం’ సీరియల్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కార్తీక దీపం దెబ్బకు పెద్ద పెద్ద సీరియల్స్, సినిమాలు, గేమ్ షోస్ ఇలా అన్నీ రేటింగుల్లో వెనకబడిపోతున్నాయి. ఇందుకు కార‌ణం ఆ సీరియల్‌లో వంటలక్కగా తన నటనతో అందరిని ఆకట్టుకుంటున్న ప్రీతి విశ్వనాథ్ వ‌ల్లే అని చెప్పాలి.

ఇక ఇటీవ‌ల ఈ సీరియ‌ల్ అభిమానుల్లో తెలంగాణ సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్‌ అనే వ్యక్తి సెప్టెంబర్‌ 3న ఏకంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) టైమింగ్‌నే మార్చ‌మ‌ని అడ‌గ‌డం హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎంద‌కంటే.. రాత్రి రాత్రి 7.30 అయ్యిందంటే వంట‌ల‌క్క కోసం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఇంట్లో ఒకే టీవీ ఉంటే ఒకరి కోసం ఒకరు త్యాగం చేయాలి. లేకపోతే ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది.

అందుకే ఐపీఎల్ టైం ను మార్చండి. మా ఇంట్లో గొడవలను నివారించండి అంటూ ట్వీట్ చేశారు శివచరణ్. దీంతో చాలా మంది శివ‌చ‌ర‌ణ్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే తాజాగా వంటలక్క (ప్రేమి విశ్వనాథ్) శివచరణ్‌ అభిమానానికి ఫిదా అయ్యి.. ఏకంగా 32 అంగుళాల టీవీనే స‌ర్పైజ్‌ గిఫ్ట్‌గా అత‌డి ఇంటికి పంపించింది. దీంతో శివ‌చ‌ర‌ణ్ ఫ్యామిలీ ఫుల్ ఖుషీ అయింది.

కార్తీక దీపం సీరియల్ అభిమానికి టీవీ కానుకగా పంపించిన దీప

ఐపీఎల్ టైమింగ్ మార్చమన్న అభిమానికి వంట‌ల‌క్క సర్పైజ్ గిఫ్ట్‌‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts