కేంద్రమంత్రి రాజీనామా: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం…

September 18, 2020 at 9:23 am

ఊహించని విధంగా పార్లమెంటులో మోదీ సర్కారు ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలగిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ఏకైక మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ గురువారం తన పదవికి రాజీనామా చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక ఆర్డినెన్సులు, చట్టాలకు నిరసనగా తాను రాజీనామా చేసినట్లు, రైతుల సోదరిగా, బిడ్డగా వారి తరఫున నిలిచినందుకు గర్వంగా ఉందని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇక హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలపగా, వెంటనే ఆమె శాఖ అయిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ బాధ్యతలను కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమార్‌కు అప్పగించారు.

కాగా, భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 75 క్లాజ్ 2 ప్రకారం కేంద్రమంత్రి సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖను అదనపు బాధ్యతగా చూడాలని రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ మంత్రి నరేంద్రసింగ్ ను కోరారు.

కేంద్రమంత్రి రాజీనామా: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts