వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

September 27, 2020 at 7:25 pm

వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ బిల్లులపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలగిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన అకాలీదళ్.. నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన హర్ సిమ్రత్ కౌర్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో అటు పంజాబ్ రాష్ట్రంలోనూ.. ఇటు కేంద్రంలోనూ ఈ రెండు పార్టీలు అధికారాన్ని పంచుకున్నాయి.

ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) బిల్లు 2020, ది ఫార్మార్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆఫ్ ప్రైస్ అస్యురెన్స్ అండ్ ఫాం సర్వీసెస్ బిల్లు 2020 అండ్ ది ఎషెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్లు 2020లను విపక్షాల తీవ్ర నిరసనల మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టగా, ఆమోదం పొందాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపంగా మారాయి.

 

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
0 votes, 0.00 avg. rating (0% score)