2 కిలోల చేప‌ను రూ. 21 వేల‌కు కొన్న వైసీపీ నేత.. ఎందుకంత స్పెష‌లంటే?

September 21, 2020 at 9:07 am

సాధార‌ణంగా కిలో చేప‌లు రూ. 3 వంద‌ల ద‌గ్గ‌ర నుంచి రూ.6 వంద‌ల వ‌ర‌కు ఉంటాయి. కొన్ని కొన్ని చేప‌లు వెయ్యి రేంజ్‌లో కూడా ఉంటాయి. కానీ, తాజాగా ఓ వైసీపీ నేత కేవ‌లం రెండు కిలోల చేప‌ను ఏకంగా రూ. 21 వేలు పెట్టి కొనుగోలు చేశారు. మ‌రి ఆ చేప ఎందుకంత స్పెష‌లంటే.. అది పుల‌స చేప‌. ఈ చేపలు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. అది కూడా గోదావరి జిల్లాల్లో మాత్రమే లభిస్తుంది.

`పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి` అనే సామెత వినే ఉంటారు. అది అక్ష‌రాల నిజం. అవును, పుల‌స‌ చేప చాలా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇక ఉభయ గోదావరి జిల్లాలలో పులస చేప పులుసు బాగా ఫేమ‌స్ అని చెప్పాలి. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్‌కు సింబల్‌గా నిలుస్తోంది.

ఇక‌ గోదావరిలో వరద నీరు పారుతున్న సమయంలో మాత్రమే ఈ చేపలు వరదకు ఎదురు ఈదుతూ వచ్చి, మత్స్యకారుల వలలకు చిక్కుతుంటాయి. అయితే ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ చేప బ‌రువు రెండు నుంచి రెండున్న‌ర కిలోలు ఉండ‌గా.. దీన్ని అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత, నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మల కొండలరావు రూ. 21 వేలు పెట్టి కొనుగోలు చేశారు.

2 కిలోల చేప‌ను రూ. 21 వేల‌కు కొన్న వైసీపీ నేత.. ఎందుకంత స్పెష‌లంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts