పురుషత్వాన్ని తొలగిస్తే.. అప్పుడు బుద్ది వస్తుంది : ఇమ్రాన్ ఖాన్

September 15, 2020 at 6:34 pm

ఇటీవలే పాకిస్థాన్ లోని లాహోర్ లో వివాహితపై కన్న బిడ్డల ముందే దారుణంగా ఇద్దరు నిందితులు అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోవటంతో దాన్ని ఆసరాగా చేసుకున్న కామాంధులు… మహిళను నిర్మానుష్య ప్రదేశంలో కి ఎత్తుకెళ్లి పిల్లల ముందే దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. మహిళలపై అత్యాచారం చేసేందుకు భయపడేలా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తు ఎన్నో నిరసన ప్రదర్శనలు కూడా చేశారు దేశ ప్రజలు.

కాగా ఈ అత్యాచార ఘటనపై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని ఉరితీయడం కాదు వారి పురుషత్వం తొలగించాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇమ్రాన్ ఖాన్. అత్యాచార కేసులో నిందితులుగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీస్తే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ కి అపఖ్యాతి వస్తుంది కాబట్టి.. నిందితులకు ఔషధాలు ఉపయోగించి పూర్తిగా పురుషత్వం తొలగిపోయేలా చేయాలని అప్పుడైతే వారికి బుద్ధి వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

పురుషత్వాన్ని తొలగిస్తే.. అప్పుడు బుద్ది వస్తుంది : ఇమ్రాన్ ఖాన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts