పులివెందులలో సభ పెడతా…ఆకు రౌడీలు ఏం చేయలేరు…

September 18, 2020 at 1:52 pm

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టులు తప్పుబడుతున్నాయని తమ పార్టీ ఎంపీలు అంటున్నారని, కానీ ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉండటం వల్లే కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయన్నారు. పార్టీ జెండాలో మూడు రంగులు ఉన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలకు వేసేస్తే కోర్టు ఎలా సమర్థిస్తుందని ప్రశ్నించారు.

‘నా సహచర ఎంపిలతోనే నన్ను కొట్టిస్తా అంటూ నీచంగా మాట్లాడిస్తున్నారని, వారి భవిష్యత్ ఏంటో త్వరలోనే తేలుస్తాని, ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేను అంటూ ఎంపీ ఫైర్ అయ్యారు. తన ఒంటిపై చేయి పడితే తనని కాపాడేందుకు హేమహేమీలున్నారని అన్నారు. పులివెందులలో 10 వేల మందితో సమావేశం పెడతానని, అక్కడ తనని ప్రేమించేవారున్నారని, ప్రభుత్వం ఎన్ని ఉన్మాద చర్యలు చేసిన కోర్టులు చిరంజీవులుగా మిగులుతాయని తెలిపారు. రాబోయే రోజులన్నీ మంచిరోజులే అని, అమరావతి రైతులెవరు ఆందోళన చెందోద్దని, ప్రత్యేక హోదా తమ పార్టీ ప్రాధాన్యత అంశంగా కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు.

 

పులివెందులలో సభ పెడతా…ఆకు రౌడీలు ఏం చేయలేరు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts