రాజుగారి ఎఫెక్ట్: ఆఫీసు పేరు మార్చేశారు…

September 18, 2020 at 2:07 pm

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీ నుంచి గెలిచి అదే పార్టీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే తమ పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్ కాదని యువజన శ్రామిక రైతు పార్టీని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భీమవరంలో ఉన్న రఘురామ ఆఫీసు పేరు కూడా మార్చేశారు.

ఎంపీ కార్యాలయం పేరును శుక్రవారం నాడు మార్చేశారు. గతంలో ఎంపీ కార్యాలయానికి ‘వైఎస్సార్ కాంగ్రెస్ నరసాపురం పార్లమెంట్ సభ్యుల వారి కార్యాలయం’ అని పేరు ఉండేది. ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ కార్యాలయంగా మార్చడం జరిగింది. అంతేకాదు.. అక్కడ ఆఫీసులో ఉన్న ఫ్లెక్సీల్లో ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఫొటోలు కూడా తొలగించారు. అయితే వైఎస్సార్, విజయమ్మ, జగన్, రఘురామ బొమ్మలు మాత్రం ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇక ఈ పేరు మార్పు వ్యవహారం రాజు గారికి తెలిసి జరిగిందో లేదో తెలియాల్సి ఉంది.

రాజుగారి ఎఫెక్ట్: ఆఫీసు పేరు మార్చేశారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts