ఉన్మాదుల్లా వైసీపీ నేతలు… నా రక్తం తాగారు…వైసీపీ ఎంపీ

September 23, 2020 at 2:33 pm

అధికార వైసీపీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రమంతా తిరుగుతానని.. ఎవరేం చేస్తారో చూస్తాన్నారు. వైసీపీ శ్రేణులు తనను పిచ్చికుక్క అని మాట్లాడుతున్నారని, తోలు తీస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. అలాగే తాను ఎవరి బొమ్మతో గెలవలేదని.. తన బొమ్మతోనే గెలిచాని, తన రక్తం తాగిన పార్టీ.. రక్తం తిరిగి ఇస్తుందా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని, తన సెక్యూరిటీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారు అలాగే మాట్లాడితే.. తన భద్రత రెట్టింపు అవుతుందన్నారు.

హిందువులు అంటే జగన్‌కు గౌరవం ఉంటే..తిరుమలలో సంతకం పెట్టాకే దర్శనానికి వెళ్లాలని, ముఖ్యమంత్రికి స్వరూపానంద హితోపదేశం చేయాలన్నారు. హిందువు రక్షకుడిగా ఉంటాడనుకున్న సీఎం.. కక్షకుడిగా మారారని అన్నారు. హోంమంత్రితో ముఖ్యమంత్రి నిధుల గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని, జగన్‌.. తెలుగును భూస్థాపితం చేసి ఇంగ్లీష్‌ను ప్రోత్సహిస్తున్నారని, అమిత్‌ షాతో సీఎం జగన్‌ 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదని చెప్పారు.

ఉన్మాదుల్లా వైసీపీ నేతలు… నా రక్తం తాగారు…వైసీపీ ఎంపీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts