రైతులను అంతలా అవమానిస్తారా : మోడీ

September 29, 2020 at 4:13 pm

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వ్యవసాయ బిల్లును తీసుకువచ్చి పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాల విమర్శల మధ్య ఆమోదముద్ర వేయించుకున్న విషయం తెలిసిందే. అయితే వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు ఇప్పటికీ కొన్నిచోట్ల ఆందోళనలు చేపడుతున్నారు. ఢిల్లీలో తీవ్రస్థాయిలో వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన ఆందోళన కారులు వ్యవసాయ పరికరాలతో పాటు ఒక ట్రాక్టర్ ను కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు పూజించే యంత్రాలు పరికరాలకు నిప్పంటించి ధ్వంసం చేయడం అంటే దేశానికి అన్నం పెట్టే రైతన్నను అవమానించడమే అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కావాలని కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకిస్తున్నారు అంటూ విమర్శించారు. రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే సౌలభ్యాన్ని వ్యవసాయ చట్టం ద్వారా కేంద్రం కల్పిస్తే రైతులకు ఆ స్వేచ్ఛను కల్పించడం కొందరు సహించలేకపోతున్నారు అంటూ విమర్శించారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ

రైతులను అంతలా అవమానిస్తారా : మోడీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts