ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌….!

September 21, 2020 at 9:58 am

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మొద‌టి సారి రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి రామ్ చర‌ణ్ టీజ‌ర్ విడుద‌ల కాగా.. దానికి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. తార‌క్ టీజ‌ర్ ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తున్నారు. వాస్త‌వానికి కరోనా వైరస్ ప్రభావం లేక పోతే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడ‌క్షన్‌ పనులు జరగాల్సిన ఈ చిత్రం.. లౌక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌ నిలిచిపోయింది. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ టీజ‌ర్ కూడా విడుద‌ల కాలేదు. అయితే అక్టోబర్ మొద‌టి వారం నుంచి ఈ చిత్రం మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

ఎన్టీఆర్, చరణ్ కూడా షూటింగ్‌లో పాల్గొనున్నారు. మ‌రోవైపు ఈ సినిమా షూటింగ్ చేసిన పార్ట్‌కు సంబంధించి ఎడిటింగ్ మొదలు పెట్టాడు రాజమౌళి. ఈ సందర్భంగా దసరాకు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్ కట్ చేసినట్టు సమాచారం. ప్ర‌స్తుతం కీరవాణి ఈ టీజర్‌కు ఆర్ఆర్ సమకూర్చే పనిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ న‌టించ‌నున్న‌ సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌….!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts