రాజ్ నాథ్ సింగ్ ప్రకటన.. పార్లమెంటులో గందరగోళం..!

September 15, 2020 at 4:59 pm

ఇటీవలే వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్లమెంటులో ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య వాడి వేడి చర్చలు కొనసాగాయి. ఈ క్రమంలోనే భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో… పార్లమెంటు లో వాడి వేడి చర్చ జరుగుతోంది. దీనిపై పార్లమెంటులో చర్చ జరగగా కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభ మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో చివరికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

ఇటీవల పార్లమెంటు వేదికగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటన నేపథ్యంలో పార్లమెంటులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక ఈ ప్రకటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది . భారత భూభాగాన్ని సరిహద్దులో చైనా ఆక్రమించుకుందనే విషయాన్నీ గతంలో తమ పార్టీ నేతలు చెప్పినప్పటికీ… బీజేపీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతూ వచ్చిందని ఆరోపించారు కాంగ్రెస్ సభ్యులు. ఇప్పటికి కూడా అసలు విషయాలను పూర్తిగా చెప్పడం లేదు అంటూ ఆరోపించారు. కనీసం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు అంటూ సభ నుంచి వాకౌట్ చేశారు కాంగ్రెస్ సభ్యులు.

రాజ్ నాథ్ సింగ్ ప్రకటన.. పార్లమెంటులో గందరగోళం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts