డ్ర‌గ్స్ కేసులో నలుగురు స్టార్ల పేర్లను బ‌య‌ట‌పెట్టిన‌ రకుల్?

September 26, 2020 at 7:22 am

ప్ర‌స్తుతం అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ను డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ యువ కెర‌టం సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసులో డ్ర‌గ్స్ కోణం బ‌య‌ట‌ప‌డ‌టంతో.. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) రంగంలోకి దిగి లోతుగా విచార‌ణ చేప‌ట్ట‌గా ప‌లువురి పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో వారికి ఇప్ప‌టికే నోటీసులు కూడా జారీ చేశారు.

ఇక‌ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ నుంచి నోటీసులు అందుకున్నహీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్ నిన్న‌ విచారణకు హాజరయింది. ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి నిన్న‌ ఉదయం ఆమె విచారణ నిమిత్తం వెళ్లింది. దాదాపు నాలుగు గంటల సేపు విచారణ కొనసాగ‌గా.. ఆమె ప‌లు కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ క్ర‌మంలోనే రియా చక్రవర్తితో డ్రగ్ చాటింగ్ చేసినట్టు ఆమె ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, తాను డ్రగ్స్ ఎప్పుడూ వాడలేదని తెలిపింది. డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులతో కూడా తనకు సంబంధం లేదని చెప్పింది. అలాగే ఈ విచారణలో నలుగురు స్టార్ల పేర్లను రకుల్ వెల్లడించినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ధర్మ ప్రొడక్షన్స్ అంటే కరణ్ జొహార్ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్ ఈ నలుగురికీ డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలిపిన‌ట్టు స‌మాచారం.

డ్ర‌గ్స్ కేసులో నలుగురు స్టార్ల పేర్లను బ‌య‌ట‌పెట్టిన‌ రకుల్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts