చిరు కోసం చెర్రీ రిస్క్‌.. జ‌క్క‌న్న ఇర‌కాటంలో ప‌డ‌తాడా?

September 29, 2020 at 7:56 am

ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఎన్టీఆర్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే 70శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్‌ పూర్తైంది. అయితే క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్.. త్వ‌ర‌లో మ‌ళ్లీ ప్రారంభం కానుంది.

ఇక చెర్రీ మ‌రోవైపు చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న `ఆచార్య‌` చిత్రంలోనూ న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. చిరు కంటే ముందే చెర్రీ ఆచార్య షూటింగ్‌లో పాల్గొనున్నారు. అయితే ఇక్కడ మరో పెద్ద మార్పు కూడా ఉంది. అదే చరణ్ లుక్. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం చెర్రీ బాడీ బిల్డ్ చేసి సరికొత్తగా తయారయ్యారు. ఇటీవ‌ల విడుద‌లైన ఆయ‌న టీజ‌ర్‌లో కండలతో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు చెర్రీ.

ఇదంతా జక్కన్న క్రెడిట్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఆచార్య కోసం ఈ లుక్ లో మార్పులు జరుగుతున్నాయట. కథలో చరణ్ పాత్రను టైలర్ మేడ్ తరహాలో రాసుకున్నారట కొరటాల. కాబట్టి చరణ్ రిస్క్ తీసుకుని లుక్ మార్చుకోక తప్పదు. ఇక చెర్రీ లుక్ మార్చుకుని ఆచార్య షూటింగ్ ఫినిష్ చేసిన వెంట‌నే.. మ‌ళ్లీ అల్లూరి సీతారామరాజు లుక్‌లో మారాలి. ఏమాత్రం జాప్యం జరిగినా జ‌క్క‌న్న ఇర‌కాటంలో ప‌డిన‌ట్టే అవుతుంది. మ‌రి ఈ విష‌యంలో చెర్రీ ఎంత కేర్ తీసుకుంటాడో చూడాలి.

చిరు కోసం చెర్రీ రిస్క్‌.. జ‌క్క‌న్న ఇర‌కాటంలో ప‌డ‌తాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts