చిరు నెక్ట్స్ సినిమాలోనూ చెర్రీ?

September 20, 2020 at 12:11 pm

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం అనంతరం చరణ్ చిరుతో మరోసారి స్క్రీన్ ను పంచుకొనే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. చిరంజీవి ఆచార్య త‌ర్వాత రెండు రీమేక్ చిత్రాలను లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్ ఒక‌టి.

ఇప్పటికే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న దర్శకుడు వివి వినాయక్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసేసి చిరును మెప్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో కూడా చెర్రీ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌రకు నిజం ఉంది అన్న‌ది త్వ‌ర‌లో తెలియ‌నుంది.

చిరు నెక్ట్స్ సినిమాలోనూ చెర్రీ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts