వెబ్ ఎంట్రీకి ర‌ణ్‌బీర్‌క‌పూర్ సై..?

September 23, 2020 at 7:14 am

ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని సినీతార‌లు అందిపుచ్చుకుంటున్నారు. ఒక‌ప్ప‌టి త‌రం నాటాకాల‌ను ప్రేమించిన‌ట్లుగానే.. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా నాట‌కాల‌ను వేసేందుకు మ‌క్కువ చూపిన‌ట్లుగానే ప్ర‌స్తుత యువ‌క‌థానాయ‌కులు, నాయిక‌లు వెబ్ సిరీస్‌పై ఆస‌క్తిని చూపుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు బాలివుడ్‌, టాలివుడ్ సినీతార‌లు ఈ వెబ్ సిరీస్‌లో అడుగుపెట్టారు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు లాంటి ప‌లువురు తెలుగు పాపుల‌ర్ న‌టులు సైతం ఉండ‌డం విశేషం. ఇప్పుడు బాలివుడ్‌లోనూ వెబ్ సీరిస్‌ల హ‌వా కొన‌సాగుతున్న‌ది. తాజాగా ర‌ణ్‌బీర్‌క‌పూర్ సైతం వెబ్ ఎంట్రీకి సిద్ధ‌మ‌య్యాడ‌ని సినీవ‌ర్గాలు కోడై కూస్తున్నాయి.

రణ్‌బీర్‌ కపూర్‌ ఎంట్రీ వార్తలు బాలీవుడ్‌లో షికారు చేస్తున్నాయి. డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ సార‌థ్యంలో హాలీవుడ్‌ నటుడు టామ్‌ హిడిల్‌స్టన్ ప్ర‌ధాన పాత్రలో, భారీబడ్జెట్‌ డ్రామాగా తెర‌కెక్కిన టీవీ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’ సినిమా హిందీ వెర్షన్‌లో రణ్‌బీర్ నటించనున్నార‌ని దాని స‌మాచారం. మొత్తంగా హిందీలో ఈ క‌థ ఆధారంగా 10 ఎపిసోడ్ల‌ను నిర్మించనున్నారని తెలుస్తున్న‌ది. కొన్ని వారాల క్రితమే ఈ సిరీస్‌లో నటించేందుకు రణ్‌బీర్‌ అధికారికంగా సైన్‌ చేశారని సినీవ‌ర్గాల టాక్‌‌. అయితే దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాల‌నే ఆలోచనలో ఉందట డిస్నీ హాట్‌స్టార్‌ సంస్థ. అదీగాక ఈ కథను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని లొకేషన్లలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్న‌ద‌ని స‌మాచారం. ప్రస్తుతం రణ్‌బీర్‌ మల్టీస్టారర్‌ మూవీ ‘బ్రహ్మాస్త్ర’, ‘షంషేరా’లతో పాటు మరో సినిమాలో నటిస్తున్నారు.

వెబ్ ఎంట్రీకి ర‌ణ్‌బీర్‌క‌పూర్ సై..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts