ఏపీ స‌ర్కార్ న్యూ రికార్డ్‌.. ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి!

September 17, 2020 at 11:16 am

నవ్యాంద్రప్రదేశ్‌ రెండో సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఎన్నో సంక్షేమ పథకాలు అమ‌లు చేస్తూ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే సంక్షేమ పథకాలు అందివ్వాలంటే.. ముందుగా కావలసిన కార్డు రేషన్ కార్డు. రేష‌న్ కార్డు లేక‌పోతే.. ఏ సంక్షేమ ప‌థ‌కాన్ని పొంద‌లేదు.

అయితే ఓ సామాన్యుడు రేష‌న్ కార్డు పొందాలంటే.. ఎన్ని ఆఫీసుల‌ చుట్టు తిర‌గాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కానీ, తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఓ సామాన్యుడికి కేవ‌లం ఒక్క‌రోజులోనే రేష‌న్ కార్డు వ‌చ్చేలా చేసింది. తూర్పు గోదావరి జిల్లా మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో ఉంటోన్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు గతంలో ఎన్నిసార్లు రేషన్‌ కార్డుకు అప్లై చేసినా పని అవ్వలేదు.

అయితే తాజాగా కుడిపూడి ఆంజనేయులు గ్రామ వలంటీర్‌‌ను క‌లిశారు. దీంతో అత‌డిని గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి మరోసారి దరఖాస్తు చేయించాడు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తును తహసీల్దార్‌ సమర్పించగా.. లబ్ధిదారుని అర్హతల్ని పరిశీలించి వెంట‌నే రేషన్‌ కార్డు మంజూరు చేశారు. ఏదేమైనా ఒక్క‌రోజులోనే రేష‌న్ కార్డు మంజూరు కావ‌డం రాష్ట్రంలోనే తొలిసార‌ని చెప్పాలి.

ఏపీ స‌ర్కార్ న్యూ రికార్డ్‌.. ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts