ఐపీఎల్ 2020: విరాట్‌కి రూ.12 లక్షల జరిమానా.. రీజ‌న్ అదేనా?

September 25, 2020 at 1:34 pm

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీఎల్ 2020లో ఊహించ‌ని షాక్ త‌గిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ .. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ముఖ్యంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాట్‌తో చెలరేగిపోయాడు. అయితే రాహుల్.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. కోహ్లి రెండు క్యాచ్‌లను జారవిడిచాడు.

ఈ క్ర‌మంలోనే కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాదు సిక్సర్ల మోత మోగించి జట్టు స్కోరును 200 దాటించాడు. ఇక పంజాబ్ 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు 109 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో కోహ్లీ సేన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.

ఇదే ఎదురు దెబ్బ అనుకుంటే.. విరాట్‌కు మ‌రో షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లికి భారీ జరిమానా పడింది. బౌలింగ్ పూర్తి చేయడానికి కేటాయించిన టైమ్‌ కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకోవడంతో.. కోహ్లికి రూ. 12 లక్షల జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎల్ 2020: విరాట్‌కి రూ.12 లక్షల జరిమానా.. రీజ‌న్ అదేనా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts