లారీలో తీసుకొస్తుండ‌గానే రెడ్‌మీ ఫోన్లు మాయం.. ఎంత విలువంటే..

September 16, 2020 at 7:53 pm

చ‌క్కాగా స్కెచ్ వేస్తున్నారు. లారీలు ఎప్పుడు వ‌స్తున్నాయో ప‌సిగ‌డుతున్నారు. అదును చూసి మీద ప‌డుతున‌న్నారు. మూడో క‌న్నుకు తెలియ‌కుండా అందులోని విలువైన ఫోన్ల‌ను ఎత్తుకు పోతున్నారు. ఇప్పుడీ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. కొల్‌క‌త్త నుంచి చిత్తూరు శ్రీ‌సిటీకి రెడ్‌మీ ఫోన్ల లోడ్‌తో ఓ లారీ బ‌య‌లుదేరింది. మ‌ధ్య‌లో కొద్దిసేపు వాహనాన్ని నిలిపి డ్రైవ‌ర్ సేద‌తీరాడు. అనంత‌రం తిరిగి బండెక్కాడు. అయితే వాహ‌నంలో ఏదో మార్పు. అనుమానం వ‌చ్చింది. అంతే బండిని ఆపి వాహ‌నాన్ని చెక్ చేసి జ‌రిగింది చూసి కంగుతిన్నాడు. సుమారు రూ.70ల‌క్ష‌ల విలువైన రెడ్ మీ నోట్ ఫోన్లు మాయం అయ్యాయి. ఎలా? ఎక్క‌డ‌? ఎవ‌రు? దొంగిలించారో పాలుపోక పిచ్చెక్కిపోయాడు. వెంట‌నే మంగ‌ళ‌గిరికి చేరుకుని పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే లారీలో ఏమున్నాయ‌నే విష‌యం ఒక్క డ్రైవ‌ర్‌కు మాత్ర‌మే తెలియ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉండ‌గా.. ఇప్పుడే కాదు గ‌త ఆగ‌స్టులోనే ఇలాగే ఓ లారీలో త‌ర‌లిస్తున్న ఫోన్ల‌ను దుండ‌గులు ఎత్తుకెళ్లారు. త‌మిళ‌నాడు రాష్ట్రం పెరంబూర్ నుంచి ముంబైకి మొబైల్ ఫోన్ల‌తో ఓ లారీ బ‌య‌లుదేరింది. స‌రిగ్గా ఆంధ్ర బొర్డ‌ర్ ఇదే చిత్తూరు జిల్లా న‌గ‌రికి చేరుకోగానే గుర్తుతెలియ‌ని దుండ‌గులు లారీని అట‌కాయించి, డ్రైవ‌ర్‌ను కొట్టి అందులోని సుమారు రూ. 6కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల‌ను దోచుకుపోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడిదే అంశం స‌ద‌రు ఫోన్ల కంపెనీలను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని అధికారులు విచార‌ణ చేప‌డుతున్నారు.

లారీలో తీసుకొస్తుండ‌గానే రెడ్‌మీ ఫోన్లు మాయం.. ఎంత విలువంటే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts