డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. కొత్త వివాదంలో ఇరుక్కున్న న‌టి సంజ‌నా!

September 20, 2020 at 10:21 am

ప్ర‌స్తుతం శాండల్‌వుడ్‌లో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పుడు ఎవ‌రి బండారం బ‌య‌ట‌ప‌డుతుందో అని సినీ తారలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ఇప్ప‌టికే డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనా గ‌ల్రానీతో పాటు ప‌లువ‌రు అరెస్ట్ అయ్యారు. అయితే డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయిన సంజ‌నా కేసు మొద‌టి నుంచి ఏదో ఒక మ‌లుపు తిరుగుతూ వ‌స్తోంది.

తాజాగా సంజనాపై మరో ఆరోపణ తెరమీదకు వచ్చింది. నటి సంజనా గల్రానీ లవ్ జీహాద్ లో చిక్కుకున్నారని.. ఆమె మతం మార్చుకుని మహీరాగా మారారని ప్రముఖ సమాచార హక్కుల కార్యకర్త ప్రశాంత్ సంబర్గి, సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె మతాన్ని మారుస్తూ ముస్లిం పెద్దలు ఇచ్చిన సర్టిఫికెట్ ను సైతం ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

2018లో నటి సంజనా హిందూ మతం మారిపోయారని ప్ర‌శాంత్ స్ప‌ష్టం చేశాడు. మతం మార్చుకున్న ఆమెను ఇకపై సంజనా గల్రానీ అలియాస్ అర్చనా మనోహర్ గల్రానీగా పిలివకూడదని, మహిరాగానే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనాలని ప్రశాంత్‌ డిమాండ్ చేశారు. కాగా, మ‌రోవైపు అజీజ్ అనే వ్యక్తితో సంజన ప్రేమలో పడిందని, వారి నిశ్చితార్థం కూడా జరిగిందని కొన్ని చిత్రాలు ఇటీవ‌ల బ‌య‌ట‌కు రావ‌డం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు మ‌రో కొత్త‌ స‌మ‌స్య సంజ‌నాకు వ‌చ్చి ప‌డింది.

డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. కొత్త వివాదంలో ఇరుక్కున్న న‌టి సంజ‌నా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts