బన్నీ `పుష్ప‌`లో సాయి పల్లవి.. రోల్ ఏంటంటే?

September 25, 2020 at 1:08 pm

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `పుష్ప‌`. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు‌. ఇప్ప‌టికే విడుద‌ల అయిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ సినిమా భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మ‌రో కొత్త అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో బ‌న్నీ చెల్లెలి పాత్ర కోసం డైరెక్ట‌ర్ సుకుమార్.. ఫిదా బ్యూటీ సాయి పల్లవిని అనుకుంటున్నారట.

ఇందులో చెల్లెలి పాత్ర కూడా కీలకం కాగా.. ఆ పాత్రకు సాయి పల్లవినే కరెక్ట్ అని భావిస్తోన్న సుకుమార్.. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే మ‌ని సాయి ప‌ల్ల‌వి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందో.. లేదో.. తెలియాల్సి ఉంది. కాగా, ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.

బన్నీ `పుష్ప‌`లో సాయి పల్లవి.. రోల్ ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts