ఎస్పీ బాలుపై సల్మాన్ ఖాన్ ఎమోష‌న‌ల్ ట్వీట్.. ఆందోళ‌నలో ఫ్యాన్స్‌!

September 25, 2020 at 9:54 am

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందంటున్న డాక్టర్లు.. నిమిష నిమిషానికి ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నదని చెబుతున్నారు. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎస్పీ బాలు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింద‌ని తెలియంతో.. ఆయ‌న అభిమాన‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

ఇప్ప‌కే బాలు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. బాలు పరిస్థితి తెలుసుకునేందుకు ప్రముఖ నటుడు కమలహాసన్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా బాలు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఇక తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలంటూ మొదటిసారి స్పందించారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ మేర‌కు ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.

`బాలా సుబ్రమణ్యం సార్.. మీరు మళ్ళీ పూర్తి ఆరోగ్యంగా మారాలి.. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు. మీ దిల్ దీవానా హీరో ప్రేమ్. లవ్ యు, సర్.` అంటూ సల్మాన్ ట్వీట్ చేశాడు. కాగా, సల్మాన్ కు బాలుతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా 1990వ సంవత్సరంలో సల్మాన్ ఖాన్ చిత్రాల కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. ఆ సూప‌ర్ హిట్ పాట‌లే సల్మాన్ కెరీర్‌కి గట్టి పునాది వేశాయి.

ఎస్పీ బాలుపై సల్మాన్ ఖాన్ ఎమోష‌న‌ల్ ట్వీట్.. ఆందోళ‌నలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts