డ్రగ్స్​ కేసులో రకుల్.. సారీ చెప్పిన‌ స‌మంత‌!

September 14, 2020 at 7:23 am

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి ఉన్నతాధికారుల విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఇంటరాగేషన్‌లో దాదాపు 25 మంది సినీ ప్రముఖుల పేర్లు రియా బయటపెట్టినట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

ఈ లిస్ట్‌లో ప్రముఖ హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. దీంతో గ‌త రెండు రోజుల నుంచి వారిపై ట్రోల్స్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే రకుల్‌, సారా పేర్లు జాబితాలో లేవని తాజాగా ఎన్‌సీబీ పేర్కొంది. ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్​ కేపీఎస్​ మల్హోత్రా మాట్లాడుతూ.. తాము డ్రగ్స్ కేసు​కు సంబంధించి బాలీవుడ్​కు చెందిన ప్రముఖుల పేర్ల జాబితాను తయారు చేయలేదని చెప్పారు.

ఈ క్ర‌మంలోనే రియా నటీమణులు రకుల్‌, సారా పేర్లు చెప్పారని తెలిసింది? అని మల్హోత్రాను ప్రశ్నించగా.. వారి పేర్లు లేవు అని స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌యాన్ని తన ఇన్​స్టా స్టోరీస్​లో​ పోస్ట్ చేస్తూ.. అంద‌రి త‌ర‌పునా సారీ చెప్పింది. దీంతో నెటిజ‌న్లు సైతం సారీ రకుల్​, సారా అంటూ మళ్లీ ట్రెండింగ్​ చేయడం స్టార్ట్ చేశారు.

డ్రగ్స్​ కేసులో రకుల్.. సారీ చెప్పిన‌ స‌మంత‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts