సినీ హీరోయిన్ల ఫోన్ల‌లో నీలిచిత్రాలు..!

September 30, 2020 at 1:57 pm

శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ కొన‌సాగిన కొద్దీ కొత్త కొత్త విష‌యాలు వెలుగువ‌స్తున్నాయి. సినీ అభిమానుల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతున్నాయి. ఇప్ప‌టికే డ్రగ్ కేసులో క‌న్న‌డ‌భామ‌లు రాగిణి, సంజనల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచార‌ణ చేస్తున్నారు. ఆ అందాల తార‌లు వెల్ల‌డించిన విష‌యాల ఆధారంగా సీసీబీ పోలీసులు మ‌రికొంద‌రి ప్ర‌ముఖుల‌ను త‌మ‌ ఆఫీసుకు పిలిపించి ప్రశ్నిస్తున్నారు. విచార‌ణ‌లో కొందరు సినీ ప్ర‌ముఖులు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు వెల్ల‌డికావ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ డ్ర‌గ్స్ కేసులో మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన న‌టి సంజ‌న, రాగిణీ ఫోన్ల‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప‌రిశీలిస్తుండ‌గా మ‌రిన్నీ బాగోతాలు బయటప‌డ్డాయి. వారి ఫోణ్ల‌లో నీలి వీడియోలు, ఫోటోలు ఉన్నట్టు గుర్తించారట. దీంతో వారికి సెక్స్ రాకెట్‌తో కూడా సంబంధాలు ఉన్న‌ట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఉండగా, దానిని ఇటీవలే వారు డిలీట్ చేశారని అధికారులు తెల‌ప‌డం కొస‌మెరుపు. దీంతో డ్ర‌గ్స్ కేసుతో పాటు ఈ బ్లూ ఫిల్మ్ స్కాంల సంబంధమున్న వారందరికి నోటీసులిచ్చి విచారణ చేపట్టేందుకు అధికారులు స‌న్న‌ద్ధ‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం. చూస్తుంటే ఈ కేసు ముందు ముందు మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందో చూడాలి మ‌రి ?

సినీ హీరోయిన్ల ఫోన్ల‌లో నీలిచిత్రాలు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts